దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. రెండో దశ ప్రభావం రాష్ట్రంపైనా తీవ్రంగానే ఉంది. కొవిడ్ విజృంభణ ప్రభావం.... ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులపైనా బాగానే పడింది. కార్యాలయాల్లో పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కొవిడ్ నిర్ధారణయింది.
పది రోజులుగా నిత్యం పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక్కో రోజు రెండంకెల సంఖ్యలోనూ పాజిటివ్‌గా తేలుతోంది. ధీర్ఘకాలిక వ్యాధులున్న ఓ ఉద్యోగి కరోనాతో మరణించారు. బీర్కే భవన్ వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందిలోనూ పలువురు మహమ్మారి బారినపడ్డారు. దాదాపుగా 60మందికి పైగానే కరోనా సోకినట్లు సమాచారం. వివిధ శాఖల కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. తీవ్రత దృష్ట్యా మంత్రులు, ఉన్నతాధికారులు పలువురు కార్యాలయాలకు రావడం లేదు. ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.