గ్రేటర్ రాయలసీమ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఆలోచిస్తున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోను రాయలసీమలోని అన్నీ ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూర్చోని మాట్లాడేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు.
Srikanth Reddy: రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: శ్రీకాంత్ రెడ్డి - నీటీ వాటాలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందన
ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కానీ తెలంగాణ నేతల నుంచే ఎలాంటి స్పందన లేదన్నారు.
![Srikanth Reddy: రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: శ్రీకాంత్ రెడ్డి chief whip srikanthreddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12531287-555-12531287-1626880516751.jpg)
chief whip srikanthreddy
జల వివాదంపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని... కానీ తెలంగాణ నేతల నుంచే ఎలాంటి స్పందన రావటం లేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నీటి వాటాలపై స్పష్టత వస్తే మాట్లాడుకునేందుకు సిద్ధమన్నారు. సాగు నీటిని అదనంగా వాడుకోవాలనే యోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: