'సాయంత్రంలోపు మద్యం నిల్వలపై నివేదిక ఇవ్వండి' - మద్యం నిల్వలపై నివేదిక
14:47 May 05
'సాయంత్రంలోపు మద్యం నిల్వలపై నివేదిక ఇవ్వండి'
రాష్ట్రవ్యాప్తంగా మద్యం నిల్వలపై ఆబ్కారీశాఖ ఆరా తీస్తోంది. దుకాణాల వారీగా నిల్వలు పరిశీలించాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఆదేశించారు. మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున... రాష్ట్రంలోనూ అమ్మకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు హెచ్‌ఎస్‌వోల ద్వారా దుకాణాల వారిగా వివరాలు సేకరిస్తున్నారు. సాయంత్రంలోగా లిక్కర్, బీరు ఎంత నిల్వ ఉందో ఆయా హెచ్‌ఎస్‌వోలు నివేదికలు అందించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి:వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్ష