ప్రస్తుత 2020-21 సంవత్సరం రెండు వ్యవసాయ సీజన్లలో కలిపి 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులోభాగంగా ప్రస్తుత వానాకాలంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవసరమైన నిధులు పౌర సరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, జీఎల్‌సీ, హాకా, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అవసరమైతే హాకా ద్వారా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నగరం, సంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కొనుగోలు చేస్తుంది.
వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం - వానాకాలం పంట వరిధాన్యం సేకరణ
ప్రస్తుత వానాకాలంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీజనులో ధాన్యం కొనుగోళ్ల విధానాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
![వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం crop procurement policy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9130926-1094-9130926-1602371393238.jpg)
వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 5,690 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అవసరం మేరకు పౌరసరఫరాల శాఖ వాటిని పెంచుతుంది.
ఇవీ మార్గదర్శకాలు
- మిల్లర్లు ధాన్యం తీసుకున్న 15 రోజుల్లో బియ్యంగా మార్చి ఇవ్వాలి.
- ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఇతర అవసరాలకు మళ్లించిన మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టి, క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారం జిల్లా కలెక్టర్లదే.
- చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బహిరంగ మార్కెట్టులో అవసరాలకు కలిపి ఏడాదికి 28.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.
- కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులపై ఫిర్యాదు చేసేందుకు 1800 425 00333, 1967 టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
- క్వింటాలు ఎ-గ్రేడ్ ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 చెల్లించనుంది.
- ప్రతి జిల్లా నుంచి నెలవారీగా సేకరించిన వివరాలను పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపాలి.
ఇవీ చూడండి:'రాష్ట్రంలో మొక్కజొన్న సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదు'