తెలంగాణ

telangana

ETV Bharat / city

'యువకులు అజాగ్రత్తగా ఉండొద్దు... అందరూ అప్రమత్తంగా ఉండండి' - corona cases in telangana

కరోనా బారినపడే వారిలో 21-30 ఏళ్ల మహిళలు, పురుషుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని గవర్నర్​ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. యువకులు అజాగ్రత్తగా ఉండకుండా... పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్​ ట్వీట్టర్​ ద్వారా సూచించారు.

governer tamilisai on corona cases to youth
governer tamilisai on corona cases to youth

By

Published : Aug 30, 2020, 12:24 PM IST

కరోనా పట్ల యువకులు అజాగ్రత్త వహించకూడదని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సూచించారు. వైరస్‌ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదనుకోవడం సరైంది కాదని.... తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. 45 ఏళ్ల లోపు వారు ఎక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నారన్న గవర్నర్‌.....21 నుంచి 30 మధ్య వయస్కుల కేసుల్లో స్వల్ప పెరుగుదల ఉందన్నారు.

డబ్ల్యుహెచ్ఓ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వీలైనంత త్వరగా వైద్యుల సలహాలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై ట్విట్టర్​ వేదికగా సూచించారు.

'యువకులు అజాగ్రత్తగా ఉండొద్దు... అందరూ అప్రమత్తంగా ఉండండి'

ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ABOUT THE AUTHOR

...view details