కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటంలో ప్రజలకు కావాల్సిన వైద్య సాయం అందిస్తున్న ఫిజీషియన్లు నిజమైన హీరోలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కొనియాడారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ కాన్ఫరెన్స్-2020 తమిళనాడు, టాపికాన్ వర్చువల్ సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్షలమంది ప్రాణాలను కాపాడేందుకు ఫిజీషియన్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు.
ఫిజీషియన్లే నిజమైన హీరోలు: గవర్నర్ తమిళిసై - Association of Physicians of India Tamilnadu
అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ కాన్ఫరెన్స్-2020 తమిళనాడు, టాపికాన్ వర్చువల్ సదస్సులో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. లక్షలమంది ప్రాణాలను కాపాడేందుకు ఫిజీషియన్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. వైద్యులు నిరంతరం తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం ద్వారా మెరుగైన సేవలు చేయగలుగుతారని తెలిపారు.
ఈ టాపికాన్ సదస్సులో అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ అరుల్ రాజ్, ఏపీఐ తమిళనాడు స్టేట్ చాప్టర్ ఛైర్మన్ డాక్టర్ మోహన్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు. వైద్యులు నిరంతరం తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం ద్వారా మెరుగైన సేవలు చేయగలుగుతారన్న గవర్నర్... డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవటం మరింత సులభమవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా టాపికాన్ సదస్సులో భాగంగా నిర్వహించిన సైన్స్ సెషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ వంటి పోటీల్లో గెలిపొందిన వారికి గవర్నర్ మెడల్స్ అందించారు.