హకీంపేట విమానాశ్రయం నుంచి కల్నల్ సంతోశ్ బాబు పార్థివదేహాం స్వస్థలం సూర్యాపేటకు బయలుదేరింది. విమానాశ్రయంలో ఆర్మీ అధికారులు, సిబ్బంది సైనిక వందనం సమర్పించారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, మేయర్ రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సజ్జనార్, మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఉన్నతాధికారులు ఘనంగా నివాళులు అర్పించారు.
కల్నల్ సంతోశ్కు ప్రముఖుల నివాళి... సూర్యాపేటకు పార్ధివ దేహం
కల్నల్ సంతోశ్ బాబు పార్థివదేహం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బయలుదేరింది. రేపు ఉదయం అంతిమయాత్ర నిర్వహించి, కేసారంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
కల్నల్ సంతోష్ బాబుకు ప్రముఖుల నివాళి
ఈ రోజు రాత్రికి కల్నల్ సంతోష్ బాబు భౌతిక కాయం సూర్యాపేటకు చేరుకోనుంది. రేపు సూర్యాపేట నుంచి ఆయన స్వస్థలం కేసారం వరకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు సైనిక లాంఛనాలతో ఆయన స్వస్థలంలో అంతిమ సంస్కరాలు నిర్వహించేందుకు... సైనికాధికారుల పర్యవేక్షణలో, జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేసింది.