ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రోత్సాహకాలను విడుదల చేయనుంది. రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు రూ.684 కోట్లు జమ చేయనున్నారు.
ఇప్పటి వరకు ఈ రంగాలకు రూ.2,086.42 కోట్ల ప్రోత్సాహకాలను అందించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పారిశ్రామికాభివృద్దికి వెన్నెముకగా నిలుస్తూ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ ప్రోత్సాహకాలు విడుదల చేయనుట్లు ప్రభుత్వం తెలిపింది.