మూసీ చాలా వరకు ఆక్రమణల్లోనే ఉంది. వీటి తొలగింపుపై యంత్రాంగమంతా దృష్టిసారిస్తే కానీ దీన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. మూసీలో రోజూ 1600 మిలియన్ లీటర్ల మురుగు కలుస్తుంటే... కేవలం 771 మిలియన్ లీటర్లే శుద్ధి చేస్తున్నారు. నదిలో పూడిక తీసి సుందరీకరణ చేసినా మురుగును నేరుగా ఇందులో వదిలేయడం వల్ల ఉపయోగం ఉండబోదని తేల్చారు. మూసీ దుస్థితిపై ఇటీవల ఈనాడులో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుత పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని సూచించింది.
అధికారులతో కేటీఆర్ చర్చలు..
హైకోర్టు సూచనల నేపథ్యంలో సోమవారం సంబంధిత శాఖల అధికారులతో గచ్చిబౌలిలో కేటీఆర్ సమీక్షించారు. వచ్చే రెండేళ్లలో తొలిదశ కింద నగర పరిధిలో మూసీ సుందరీకరణ చేయాలనేది రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు తెలిపారు. దీనికయ్యే వ్యయాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. 2021 చివరికల్లా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పాలకవర్గం ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటికి నదిలో కొంత భాగమైనా సుందరీకరణ చేయాలని భావిస్తున్నారు. మూసీలో మురుగు ఎకాఎకిన కలవకుండా నిరోధించేందుకు ఎన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలు అవసరమన్న దానిపై సమగ్ర నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ను కేటీఆర్ ఆదేశించారు.
అధిక భాగం ఆక్రమణల్లోనే..