తెలంగాణ

telangana

ETV Bharat / city

మజ్లిస్​, తెరాస అభ్యర్థులను ప్రజలు తిరస్కరిస్తున్నారు: రాజాసింగ్​ - greater elections

జీహెచ్​ఎంసీ మేయర్​ పీఠాన్ని తామే కైవసం చేసుకుంటామని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్​, తెరాస అభ్యర్థులను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

goshamahal-mla-rajasingh-comments-on-minister-ktr
మజ్లిస్​, తెరాస అభ్యర్థులను ప్రజలు తిరస్కరిస్తున్నారు: రాజాసింగ్​

By

Published : Nov 24, 2020, 9:48 PM IST

మజ్లిస్‌, తెరాస అభ్యర్థులను ప్రజలు తిరస్కరిస్తున్నారని భాజపా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పాతబస్తీ ప్రజలు అసదుద్ధీన్ ఒవైసీని తరిమికొడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెరాస అభ్యర్థులకు చీత్కారాలు తప్పటంలేదని విమర్శించారు.

సొంత ఇంటిని చక్కబెట్టుకోకుండా కేటీఆర్ భాజపాపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్న ఆయన.. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని తామే కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'నల్లధనమంతా భాజపా నాయకుల జేబుల్లోకే పోయింది'

ABOUT THE AUTHOR

...view details