Raja Singh Controversy : భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి సంచలనం సృష్టించారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్‌కు మద్దతివ్వని వారిని హెచ్చరించారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ తర్వాత.. భాజపాకు ఓటు వేయని వారి జాబితా తీసి.. వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని హెచ్చరించారు. ఇందుకోసమే యోగి.. వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని వ్యాఖ్యానించారు.
యూపీలో ఉండాలంటే.. యోగిని గెలిపించాల్సిందే..
Raja Singh Controversy on UP Elections : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ అన్నారు. భాజపాకు ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. భాజపా శ్రేణులు, హిందువులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి.. యోగిని మరోసారి గెలిపించాలని కోరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి.. యోగి సర్కార్ రావాలని ఆకాంక్షించారు.
"ఉత్తర్ ప్రదేశ్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఈ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలి. అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేసి మరోసారి గెలిపించాలి. కొందరు యోగి మళ్లీ సీఎం కాకూడదని కుట్రలు పన్నుతున్నారు. వాళ్లకి నేను చెప్పేదొకటే.. యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి రప్పించారు. మూడో దశ పోలింగ్‌లో భాజపాకు ఓటు వేయని వాళ్లను గుర్తిస్తాం. వాళ్ల అందరికి ఇళ్లపైకి ఈ బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం. మీకు తెలుసుగా.. ఇవి ఏం చేస్తాయో. యూపీలో ఉండాలంటే.. జై యోగి ఆదిత్యనాథ్ అనాల్సిందే. భాజపాకు జై కొట్టాల్సిందే. లేకపోతే.. ఉత్తర్ ప్రదేశ్ నుంచి పారిపోవాల్సిందే."
- రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
'భాజపాకు ఓటేయకపోతే.. ఇళ్లపైకి బుల్డోజర్లు పంపుతాం'