'భవనం కూలినా... మున్సిపల్ శాఖ మంత్రి ఎందుకు రాలేదు' - ktr
తన నియోజకవర్గంలో ఎన్నో అక్రమకట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

మున్సిపల్ శాఖ మంత్రి ఎందుకు రాలేదు
మున్సిపల్ శాఖ మంత్రి ఎందుకు రాలేదు
గోషామహల్లో భవనం కూలినా.. ఇప్పటివరకు మున్సిపల్ శాఖ మంత్రి ఎందుకు రాలేదని నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని స్వయంగా తానే ఫిర్యాదు చేసినా... మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పక్కన సెలార్ కట్టడం వల్ల గోషామహల్లో భవనం కూలుతుందని అధికారులకు ముందే ఫిర్యాదు చేసినా... ఎవ్వరూ పట్టించుకోలేదని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : లలితా జ్యువెలరీలో దొంగతనం చేసింది వీళ్లేనా...!