తెలంగాణ

telangana

ETV Bharat / city

హెచ్‌ఎండీఏ ఈ-వేలానికి మంచి ఆదరణ.. తుర్కయాంజిల్‌లో రికార్డు స్థాయిలో గజం ధర - తుర్కయాంజిల్‌లో రికార్డు స్థాయిలో గజం ధర

HMDA Plots: హెచ్​ఎండీఏ ఈ- వేలం ప్రక్రియకు మంచి ఆదరణ లభించింది. తొలిరోజు 85 ప్లాట్లకు వేలం వేయగా 73 ప్లాట్లు అమ్ముడుపోయాయి. తుర్కయాంజిల్‌లో అత్యధికంగా గజం రూ.62,500లు, బహుదూర్‌పల్లిలో అత్యధికంగా గజం రూ.42వేలు ధర పలికింది. గురువారం జరిగిన ఈ-వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.137.65 కోట్ల ఆదాయం లభించింది.

HMDA Plots
HMDA Plots

By

Published : Jul 1, 2022, 1:13 AM IST

HMDA Plots: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి నిర్వహించిన ఆన్​లైన్ ప్లాట్ల వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు విశేష ఆదరణ కనబరిచారు. మొదటి రోజు 85 ప్లాట్లకు వేలం వేయగా 73 ప్లాట్లు అమ్ముడు పోయాయి. తుర్కయాంజిల్‌లో అత్యధికంగా గజం రూ.62,500లు, బహుదూర్‌పల్లిలో అత్యధికంగా గజం రూ.42వేలు ధర పలికింది. ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం 85 ప్లాట్లకు జరిగిన ఈ-వేలంలో 73 ప్లాట్లను బిడ్డర్లు కొనుగోలు చేశారు.

బహుదూర్‌పల్లి వెంచర్‌లో 51 ప్లాట్లకు గాను 50 ప్లాట్లు వేలంలో అమ్ముడు పోయాయి. ఈ వెంచర్‌లో గజం రూ25,000 ధర నిర్ణయించగా.. అత్యధికంగా రూ.42,500లు పలికింది. అత్యల్పంగా రూ.29,000లకు కొనుగోలుదారులు కోట్‌ చేసి సొంతం చేసుకున్నారు. తుర్కయాంజిల్‌ వెంచర్‌లో 34 ప్లాట్లకు గాను 23 ప్లాట్‌లకు బిడ్‌ చేసి కొనుగోలు చేశారు. ఇక్కడ గజం రూ.40వేలు ధర నిర్ణయించగా.. అత్యధికంగా రూ.62,500, అత్యల్పంగా రూ.40,500ల వరకు అమ్మకాలు జరిగాయి. గురువారం జరిగిన ఈ-వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.137.65 కోట్ల ఆదాయం లభించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details