ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో అక్రమాలపై గవర్నర్కు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. సిన్హా కమిటీ నివేదిక ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన సిన్హా కమిటీ... ఇబ్రహీంపట్నంలో 145 ఎకరాల భూదాన్ భూముల కేటాయింపులు రద్దు చేయాలని సూచించింది. నివేదిక ఇచ్చి నాలుగేళ్లైనా... చర్యలు తీసుకోలేదని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. సిన్హా కమిటీని కొనసాగించి అక్రమ భూ కేటాయింపులపై విచారణ జరిగేలా చూడాలని కోరారు.
'భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరిపించండి' - గవర్నర్కు సుపరిపాలన వేదిక కార్యదర్శి లేఖ
ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ... గవర్నర్కు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు సిన్హా కమిటీని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

'భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరిపించండి'