వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోసహిత వత్స పూజ, కామధేను హోమం నిర్వహించారు. భోగి, మకర సంక్రాంతిని పురస్కరించుకొని శార్వరి నామ సంవత్సరం మార్గశిర మాస బహుళ అమావాస్య రోజైన నేడు గోమాత సేవలో పాల్గొంటే మంచిదని నిర్వాహకులు తెలిపారు.
వెంకటేశ్వర ఆలయంలో కామధేను హోమం - తెలంగాణ వార్తలు
వనస్థలిపురంలోని వెంకటేశ్వర ఆలయంలోని గోశాలలో గోసహిత వత్స పూజలు జరిపారు. కామధేను హోమం నిర్వహించారు. నేడు గోమాతకు పూజ చేస్తే మంచిదని నిర్వాహకులు తెలిపారు.

వెంకటేశ్వర ఆలయంలో కామధేను హోమం
ఈ సందర్భంగా వివిధ గోశాలలకు గ్రాసము, పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. భక్తులకు గోవు విశిష్టతను తెలియజేశారు.
ఇదీ చదవండి:ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై