ముగిసిన గొల్లపూడి అంతిమ సంస్కారాలు - gollapudi MARUTHI RAO FINAL FUNERAL DONE
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. అభిమానుల అశ్రునయనాల మధ్య చెన్నైలోని కన్నమ్మపేట శ్మశానవాటికలో ఆయన పెద్ద కుమారుడు సుబ్బారావు చితికి నిప్పంటించాడు. అంతిమయాత్రకు ముందు మారుతీరావు భౌతికకాయానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత సురేశ్‌బాబు నివాళి అర్పించారు. గొల్లపూడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.