తిరుమల పుణ్యక్షేత్రం.. నిత్యం గోవింద నామ స్మరణలతో మారుమోగుతూనే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఆ గోవిందుడికి తమకు తోచినంతలో కానుకలు సమర్పించుకుంటారు. అలాగే తిరుమల శ్రీవారికి తమిళనాడు రాష్ట్రం తేనెకు చెందిన భక్తుడు తంగదొరై రూ.2 కోట్ల విలువైన బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందజేశారు.
తిరుమల శ్రీవారికి స్వర్ణ శంఖుచక్రాలు బహూకరణ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు బంగారు శంఖు చక్రాలను బహూకరించారు. 3.50 కిలోల బంగారంతో ఆభరణాలను తంగదొరై అనే భక్తుడు తయారుచేయించారు. శ్రీవారి ఆలయంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి వీటిని అందజేశారు.
తిరుమల శ్రీవారికి స్వర్ణ శంఖుచక్రాలు బహూకరణ
బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఈవోకు ఆభరణాలు అందజేశారు. 3.5 కిలోల బంగారంతో స్వామివారికి శంఖు చక్రాలు చేయించినట్లు తంగదొరై తెలిపారు. గతంలోనూ ఈయన శ్రీవారికి బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు విరాళంగా అందజేశారు.
Last Updated : Feb 24, 2021, 9:40 AM IST