తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం జన్మదినాన బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర

ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​లోని ప్రముఖ దేవాలయాల్లో.. ప్రత్యేక పూజలు జరపనున్నారు. వేడుకల ఏర్పాట్లపై మంత్రి తలసాని మాసాబ్​ట్యాంక్​లోని తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Gold sari for Balkampeta Ellamma on CM's birthday In collaboration with donors
సీఎం జన్మదినాన బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర

By

Published : Feb 9, 2021, 4:59 PM IST

సీఎం కేసీఆర్​ జన్మదినాన్ని పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బంగారు చీరను సమర్పించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మాసాబ్​ట్యాంక్​లోని కార్యాలయంలో.. వేడుకల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

17వ తేదీన ఉదయం 6గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, 9గంటలకు మృత్యుంజయ హోమం, అన్నదానం వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. దాతల సహకారంతో తయారు నేయించిన రెండున్నర కిలోల బంగారు చీరను అమ్మవారికి సమర్పించనున్నట్లు వివరించారు.

అలాగే సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో.. 15 నుంచి 17వ తేదీ వరకు కోటి కుంకుమార్చన, ఆయుష్షు హోమం, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం పూజల్లో పాల్గొన్న 250మంది మహిళలకు చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు అరుణా గౌడ్, శేషుకుమారి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఈవో అన్నపూర్ణ, ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తా: వైఎస్​ షర్మిల

ABOUT THE AUTHOR

...view details