తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇవ్వనున్నారు. రూ. 2.5 కోట్ల విలువ చేసే మూడు కిలోల బంగారు శంకు, చక్రాలను అందజేయబోతున్నారు. తేని జిల్లా బోడినాయగనూరుకు చెందిన తంగదురై.. తిరుమల శ్రీనివాసుడి భక్తుడు. గత పదేళ్లలో ప్లాటినం యజ్ఞోపవీతం, బంగారు పాదాలు, దశావతరాల విగ్రహాలు, సూర్యకఠారి, కటి హస్తం, అభయహస్తంను ఆయన సమర్పించారు.
శ్రీవారికి కానుక.. మూడు కిలోల బంగారు శంకుచక్రాలు - శ్రీవారికి అందనున్న 2.5 కోట్ల విలువైన బంగారు శంకు, చక్రాల విరాళం
తిరుమల శ్రీవారికి 3 కిలోల బంగారు శంకు, చక్రాలను ఓ భక్తుడు విరాళంగా అందజేయనున్నారు. తమిళనాడులోని తేని జిల్లా బోడినాయగనూరుకు చెందిన తంగదురై అనే భక్తుడు రూ. 2.5 కోట్ల విలువ చేసే ఆ వస్తువులను తితిదేకు అందించనున్నారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం మొక్కు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
![శ్రీవారికి కానుక.. మూడు కిలోల బంగారు శంకుచక్రాలు tirumala news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10750899-609-10750899-1614098463057.jpg)
శ్రీవారికి కానుక.. మూడు కిలోల బంగారు శంకుచక్రాలు
చెన్నై నుంచి తిరుపతి చేరుకున్న తంగదురై బుధవారం.. తితిదేకు అందజేయనున్న శంకు, చక్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. ఇటీవల తాను కరోనా బారిన పడగా.. కోలుకుంటే ఈ వస్తువులను సమర్పిస్తానని మొక్కుకున్నట్లు వెల్లడించారు. మహమ్మారి నుంచి క్షేమంగా కోలుకోవటంతో మొక్కు తీర్చుకుంటున్నట్లు వివరించారు.
శ్రీవారికి కానుక.. మూడు కిలోల బంగారు శంకుచక్రాలు
ఇవీచూడండి:ఏఐ విలువలపై రాజీపడితే పెనుముప్పు తప్పదు: సత్యనాదెళ్ల