దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాం సోమవారం సాయంత్రం నుంచి నిమజ్జనం కొనసాగుతున్నప్పటికీ.. మంగళవారం ఉదయానికి ట్యాంక్‌బండ్‌పై దుర్గామాత విగ్రహాలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ మార్గ్‌లో అధికారులు ఏర్పాటు చేసిన 8 క్రేన్ల సహాయంతో నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు.
హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జనం - nimajjanam at hyderabad tank bund
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం మంగళవారం ఉదయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ మార్గ్‌లో అధికారులు ఏర్పాటు చేసిన 8 క్రేన్ల సహాయంతో నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు.
హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జనం
ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు వాహనాలను అనుమతించకపోవడం వల్ల.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రాగా.. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి.
ఇదీ చదవండిఃఓరుగల్లులో గంగమ్మ ఒడికి చేరిన దుర్గా దేవి