GRMB Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు నేడు మరోమారు సమావేశం కానుంది. ఇప్పటికే రెండు సార్లు జీఆర్ఎంబీ సమావేశం వాయిదా పడగా... తాజాగా మూడోమారు భేటీ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాకపోవడంతో సమావేశాన్ని మార్చి 11, ఏప్రిల్ 22 తేదీల్లో ఛైర్మన్ ఎంపీ సింగ్ వాయిదా వేశారు. త్వరలోనే మరోమారు సమావేశం నిర్వహిస్తామని ఛైర్మన్ ప్రకటించగా.. ఆ భేటీని ఇవాళ నిర్వహిస్తున్నట్లు గోదావరి బోర్డు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.
GRMB Meeting: నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం.. - Godavari River management Board meeting
GRMB Meeting: రెండు మార్లు వాయిదా అనంతరం నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా నేడు జీఆర్ఎంబీ భేటీ కానుంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై భేటీలో చర్చించనున్నారు.
Godavari River water Board meeting today at hyderabad jalasoudga
హైదరాబాద్ జలసౌధ వేదికగా నేడు జీఆర్ఎంబీ సమావేశం జరుగనుంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై భేటీలో చర్చించనున్నారు. తెలంగాణకు చెందిన చనాకా - కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్‌హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై సమావేశంలో చర్చ జరుగనుంది.
ఇవీ చూడండి: