జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ నెల 24 ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో గోదావరి హారతి ఉత్సవ సమితి నిర్వాహకులు కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమానికి త్రిదండి చినజీయర్‌స్వామితో పాటు మహంత్ సంపూర్ణానంద బ్రహ్మచారి హాజరవుతారని సభ్యులు, ప్రొఫెసర్ మనోహార్ రావు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా పర్యవరణం బాగుండాలనే సంకల్పంతో గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
'24న గోదావరికి మహా హారతి... చినజీయర్‌స్వామి రాక' - GODAVARI MAHA HARATHI IS GOING TO BE HELD ON 24TH OF THIS MONTH
జగిత్యాల జిల్లాలో ఈ నెల 24న గోదావరి మహా హారతి నిర్వహించనున్నారు. పర్యవరణం సమతూల్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ మహా ఉత్సవాన్ని గత 8 ఏళ్లగా చేపడుతున్నారు.
!['24న గోదావరికి మహా హారతి... చినజీయర్‌స్వామి రాక'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5144390-thumbnail-3x2-godavari.jpg)
ఆదివారం 24న ధర్మపురిలో గోదావరి మహా హారతి
ఆదివారం 24న ధర్మపురిలో గోదావరి మహా హారతి
ఇవీ చూడండి : హైకోర్టు తీర్పు తర్వాతే... ఆర్టీసీపై తుది నిర్ణయం