త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఏటా ముస్లింలు జీవాలను కొనుగోలు చేసి కుర్బాని చేస్తుంటారు. కుర్బానీలో భాగంగా జీవాన్ని మూడు భాగాలుగా చేసి.. ఒక భాగం బంధువులకు, మరో భాగం పేదవాళ్లకు.. మూడో భాగం కుటుంబసభ్యులు తీసుకుంటారు. కానీ కొవిడ్ దృష్ట్యా కుర్బానీ చేసేందుకు ముస్లింలు వెనకాడుతున్నట్లు విక్రయదారులు పేర్కొంటున్నారు. కుర్బానీ చేసినా వాటిని పంచాలంటే... కొవిడ్ భయం వెంటాడుతున్నట్లు అమ్మకందారులు చెబుతున్నారు.
బక్రీద్‌పైనా కరోనా ప్రభావం.. తక్కువ సంఖ్యలో జీవాలు లభ్యం - బక్రీద్ వార్తలు
కరోనా ప్రభావం బక్రీద్‌పైనా పడింది. సాధారణంగా బక్రీద్ వేళ పొట్టేళ్ల క్రయవిక్రయాలు జోరందుకుంటాయి. కానీ కొవిడ్ నేపథ్యంలో తక్కువ సంఖ్యలో జీవాలు లభ్యమవుతున్నాయి. ధరలూ ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం తక్కువగా ఉన్నందునే ధరలు పెరిగినట్లు విక్రయదారులు పేర్కొంటున్నారు.
బక్రీద్‌పైనా కరోనా ప్రభావం.. తక్కువ సంఖ్యలో జీవాలు లభ్యం
బక్రీద్‌ను పురస్కరించుకుని మొహదీపట్నం, పాతబస్తీ వాల్గా హోటల్ మైదానం, చిలుకలగూడ, కాచిగూడ, నింబోలి అడ్డా, మలక్ పేట్, చంచల్‌గూడ జైలు వెనుక, శాలిబండ, చెంగిచెర్ల, జియాగూడ, బోయిగూడలో పొట్టేళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఐతే గతేడాదితో పోల్చితే... ఇప్పుడు విక్రయాలు కాస్త తగ్గినట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పొట్టేళ్లు హైదరాబాద్‌కు చేరుకుంటాయి. గత ఏడాదితో పోల్చితే 40శాతం వాటి రవాణా తగ్గినట్లు చెబుతున్నారు. తద్వారా ధరలు పెరిగాయని కొనుగోలుదారులు చెబుతున్నారు.
కుర్బానికి ఏడాది పైబడిన జీవాలనే వినియోగిస్తారు. పోయిన ఏడాది.. సంవత్సరం పైబడిన జీవాలకు రూ.8వేలు పలికాయి. కానీ ఈ ఏడాది మాత్రం సుమారు వాటి ధర రూ.పదివేల వరకు పలుకుతున్నట్లు చెబుతున్నారు. ఆకర్షణీయంగా ఉండే పొట్టేళ్ల బరువును బట్టి ధరలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కటి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతున్నాయి. జీవాల రవాణా తగ్గినా ధరలు మాత్రం పెరిగాయని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి:మానవతా బంధాలను తుంచేస్తున్న కరోనా..