తెలంగాణ

telangana

ETV Bharat / city

Cinema ticket rates: సినిమా టికెట్‌ ధరలు పెంపు..

ఏపీలో చిత్ర పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. సినిమా టికెట్‌ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల రేట్లు కనిష్ఠంగా రూ.20, గరిష్ఠంగా 250 నిర్ణయించింది.

Cinema ticket rates
సినిమా టికెట్‌ ధరలు పెంపు..

By

Published : Mar 7, 2022, 8:24 PM IST

Cinema tickets : ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లు గరిష్ఠం రూ.250, కనిష్ఠం రూ.20 గా నిర్ధారించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

హీరో, డైరెక్టర్ రెన్యూమరేషన్ కాకుండా బడ్జెట్‌ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది.

సినిమా టికెట్‌ ధరలు పెంపు..

Cinema ticket rates in ap : ఏపీలో సినిమా టికెట్ల ధరలు

  • నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ- కనిష్ఠం ధర రూ.20
  • నగర పంచాయతీ ఏసీ థియేటర్లు కనిష్ఠ ధర రూ.50
  • నగర పంచాయతీ స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠం రూ.70
  • నగరపంచాయతీల్లో మల్టీప్లెక్స్‌ల్లో ధర రూ.100, రూ.250

మున్సిపాలిటీల్లో

  • మున్సిపాలిటీల్లో నాన్‌ ఏసీ- కనిష్ఠ ధర రూ.30
  • మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లు- కనిష్ఠ ధర రూ.60
  • మున్సిపాలిటీల్లో స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠ ధర రూ. 80
  • మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.125, రూ.250

మున్సిపల్‌ కార్పొరేషన్లలో

  • మున్సిపల్‌ కార్పొరేషన్లలో నాన్‌ ఏసీ- కనిష్ఠ ‍ధర రూ.40
  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏసీ థియేటర్లు కనిష్ఠ రూ.70
  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠం రూ.100
  • కార్పొరేషన్‌ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.150, రూ. 250

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details