దక్షిణ కొరియా నుంచి ఏపీలోని విశాఖకు వచ్చిన ఎల్‌జీ పాలిమర్స్ సాంకేతిక బృందాన్ని స్వదేశానికి పంపేందుకు ఆ దేశ ఎంబసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. విశాఖ పోలీస్ కమిషనర్ మీనాతో వారు భేటీ అయ్యారు. 8 మందితో కూడిన ఎల్‌జీ పాలిమర్స్ సాంకేతిక బృంద సభ్యులు కొన్ని వారాలుగా విశాఖలోనే ఉండిపోయారని... స్వదేశానికి వెళ్లేందుకు వారికి అనుమతులు వచ్చేలా చూడాలని ఎంబసీ అధికారులు కోరారు.
గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం దానిపై దర్యాప్తు చేసేందుకు భారత ప్రభుత్వ అనుమతితో దక్షిణ కొరియా నుంచి వీరంతా ప్రత్యేక విమానంలో విశాఖకు వచ్చారు. మరోవైపు విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ కొనసాగుతోంది. శనివారం నుంచి నిపుణులతో సంప్రదింపులు చేయనుంది.