ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లికి చెందిన యువతి మల్లిపల్లి గీతాంజలి (21 ఏళ్లు) సర్పంచి పదవికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లాలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న గీతాంజలి.. గ్రామంలో సమస్యల పరిష్కారంపై ఆసక్తి, ప్రజాసేవపై మక్కువతో పోటీకి సిద్ధపడినట్లు చెప్పారు.
ఏపీ పంచాయతీ పోరులో 21 ఏళ్ల యువతి పోటీ
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి నామినేషన్ దాఖలు చేశారు. ఇంజినీర్ చివరి ఏడాది చదువుతున్న ఆ యువతి... తన గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు పోటీకి సిద్ధపడినట్లు తెలిపారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో యువతి పోటీ
రాజకీయాల్లో యువత పాత్ర కీలకమైందని, వీలైనంత ఎక్కువ మంది యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. గీతాంజలి తండ్రి నారాయణ తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి.