తెలంగాణ

telangana

ETV Bharat / city

భాగ్యనగరంలో బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు - Girl kidnapped inside Saifabad police station

భాగ్యనగరంలో పలువురు దుండగులు పిల్లలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారు ఎక్కడ ఉన్నారు. ఎలా ఎత్తుకెళ్లాలనే ప్రణాళికతో తీసుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనే మాసబ్​ట్యాంకులో చోటుచేసుకుంది. రాత్రి పడుకున్న మహిళ దగ్గర నుంచి పాపను ఎత్తుకెళ్లారు.

girl kidnapped in masab tank area
భాగ్యనగరంలో బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు

By

Published : Jul 10, 2020, 10:36 PM IST

బాలిక కిడ్నాప్​కు గురైన సంఘటన సైఫాబాద్ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగి సమీపంలోని మెక్నంపూర్​కు చెందిన ముక్తార్ బేగం భర్తకు కొద్ది కాలం క్రితం ఓ ప్రమాదంలో కాలు విరిగింది. అప్పటి నుంచి ఆమె యాచక వృత్తి చేపట్టి కుటుంబాన్ని పోషిస్తోంది. బిక్షటన చేస్తూ తన రెండేళ్ల కూతురుతో కలిసి గురువారం చింతలబస్తీకి చేరుకుంది.

రాత్రి కావడం వల్ల ఆమె మాసబ్​ట్యాంకులోని మహావీర్ ఆస్పత్రి సమీపంలో గల వర్ధమాన్​ బ్యాంకు వద్ద పడుకుంది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఓ వ్యక్తి వచ్చి ఆమె పక్కనే పడుకున్న కూతురు మహీన్(2)ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. తల్లి అరుపులతో పారిపోయాడు. కాసేపటికి వారు నిద్రలోకి పోయాక మరో వ్యక్తి బాలికను ఆటోలో తీసుకెళ్లిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :ప్రార్థనా మందిరాలను కూల్చివేయడంపై ఉత్తమ్​ అగ్రహం

ABOUT THE AUTHOR

...view details