గిరిజన అమ్మాయి ఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. రాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నగర శివారులో ఆఘాయిత్యానికి గురై మృతి చెందిన గిరిజన బాలిక తల్లిదండ్రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారని... న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
'గిరిజన అమ్మాయి ఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి' - గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్
ఇటీవల హైదరాబాద్ నగర శివారులో అఘాయిత్యానికి గురై మరణించిన గిరిజన అమ్మాయి విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్ డిమాండ్ చేశారు. అగ్ర కులాల్లో చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందిస్తారని... అదే గిరిజనులపై అకృత్యాలు జరిగితే స్పందించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

girijana morcha president hussain naik responded on gatkesar rape issue
గత నెల 28న పీజీ అర్హత పరీక్ష కోసం ఘట్‌కేసర్ గురుకులానికి వచ్చే క్రమంలో అమ్మాయిపై ఆఘాయిత్యం జరిగిందని హుస్సేన్ నాయక్ వివరించారు. బాధిత అమ్మాయి 31న చనిపోయిందన్నారు. గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెరాసకు అనుకూలంగా వ్యవహారిస్తున్నారని ఆపించారు. అగ్ర కులాల్లో చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందిస్తారని... అదే గిరిజనులపై అకృత్యాలు జరిగితే స్పందించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.