జియాగూడకు చెందిన అలివేలు గత ఐదేళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నది. ఆమె భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్లో రోజు కూలీగా పని చేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా చాలామంది ఉపాధి లేక ఇంటికే పరిమితమై... తిండికి సైతం ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఆహారం, సరుకులు అందిస్తున్నది. తన వంతు సాయంగా అలివేలు తనకు వచ్చే జీతం రూ.12000 నుంచి 10వేల రూపాయలు మంత్రి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి తన పెద్ద మనసును చాటుకుంది.
పారిశుద్ధ్య కార్మికురాలు ’అలివేలు’ మనసు ఆణిముత్యం - Ghmc Worker Donates Her salary to cmrf
మనకున్న దాంట్లో పక్కవారికి సాయం చేస్తే వచ్చే కిక్కే వేరు. తనకు వచ్చే జీతం.. రూ.12000 మాత్రమే అయినా.. అందులోంచి.. రూ.10000 ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చి తన పెద్ద మనసు చాటుకుంది నగరానికి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు.
’అలివేలు’ మనసు ఆణిముత్యం
ఆమె యోగక్షేమాలు కనుక్కున్న మంత్రి ఏ సహాయం కావాలన్నా.. మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏదో ఆశించి ఈ పని చేయలేదని.. కష్టకాలంలో ఇతరులకు నా వంతు సహకారంగా చేశానని అలివేలు చెప్పింది. తనకు వచ్చిన జీతంలోంచి అధిక మొత్తం ఆకలితో ఉన్నవారికి అందించే గుణం అందరికీ ఉండదని, అలివేలుది గొప్ప మనస్తత్వమని మంత్రి ఆమెను అభినందించారు.
Last Updated : Apr 28, 2020, 11:31 PM IST
TAGGED:
’అలివేలు’ మనసు ఆణిముత్యం