బలమైన ఈదురు గాలులతో వర్షం.. చెట్ల కింద ఉండొద్దని హెచ్చరికలు.. - హైదరాబాద్ తాజా వార్తలు

14:10 July 13
బలమైన ఈదురు గాలులతో వర్షం.. చెట్ల కింద ఉండొద్దని హెచ్చరికలు..
Rain Alert: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసిముద్దవుతోంది. కాగా.. ఈరోజు నగరంలో బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశమున్నట్టు అధికారులు హెచ్చరించారు. ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని.. వాటిదాటికి చెట్లు విరిగిపడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఈవీడీఎం హెచ్చరించారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల చెట్లు నేలకొరిగి పలువురికి గాయాలైన నేపథ్యంలో.. నగరవాసులకు అధికారులు పలు సూచనలు చేశారు. చెట్ల కింద ఉండొద్దని నగరవాసులకు హెచ్చరిక జారీ చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమర్జెన్సీ కోసం ఢీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని.. ఎలాంటి సమస్య ఎదురైన వెంటనే హెల్ప్లైన్లకు ఫొన్ చేసి సమాచారమివ్వాలని ఈవీడీఎం తెలిపారు.
ఇవీ చూడండి: