GHMC News : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ రెండో సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. స్టాండింగ్ కమిటీలో మొత్తం 11 అంశాలకు గాను 9 అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది. హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ద్వారా 250 ఉద్యోగుల సర్వీస్ ఏడాది పొడిగింపుతో పాటుగా నూతన ఏజెన్సీతో ఒప్పందాన్ని స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.
GHMC News : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. 9 అంశాలకు ఆమోదం - జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ న్యూస్
GHMC News : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ రెండో సమావేశం ఈనెల 15న జరిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశంలో 9 అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది.
GHMC standing committee : రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి పెంచిన గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్ష వరకు చెల్లించేందుకు సభ్యులు ఆమోదించారు. బేగంపేట్‌లో రూ. 590 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ స్థలాన్ని పాత పాటిగడ్డ నల్ల పోచమ్మ టెంపుల్ వద్ద ఆర్బి ఓపెన్ స్థలం నుంచి ఆర్ అండ్ బి క్వాటర్ సీ119 వార్డు 149 బేగంపేట్‌కు మార్చడానికి ఆమోదం తెలిపారు. ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 17లో పంజాగుట్ట మోడల్ హౌస్ ద్వారకాపురి కాలనీ ఒక లేయర్ బీటీ, సీసీ రోడ్డు పునరుద్దరణ, ఫుట్ పాత్ నిర్మాణం కోసం రూ. 2.90 కోట్ల రూపాయలు పరిపాలన మంజూరును ఆమోదించారు. ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద రూ. 496 లక్షల వ్యయంతో నిర్మించే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి పరిపాలన మంజూరుకు ఆమోదం తెలిపింది. జంగం మెట్ డివిజన్ లో రూ. 496 లక్షల వ్యయంతో నిర్మించే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని ఆమోదించారు.