"పెళ్లి కాని జంటలకు పార్కులోకి అనుమతి లేదు". ఈ బోర్డు చూసినవారు ఎవరైనా.. మరోసారి చదువుకోకమానరు. బయటవస్తువులు, పెంపుడు జంతువులు, ప్లాస్టిక్ బాటిళ్లు లోనికి తీసుకురావొద్దనే నిబంధన చూశాము కాని.. ఇలా పెళ్లికాని వాళ్లను పార్కులోకి రావొద్దనమేంటని అనుకోకమానరు. అవును పార్కులోకి వెళ్లిన యువతీయువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో వారిని నియంత్రిచడానికి ఇందిరాపార్కు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ విషయమేమిటంటే..
హైదరాబాద్లోని దోమలగూడలో ఉన్న ఇందిరాపార్కు సందర్శకులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. వారాంతాలతో పాటు ప్రత్యేక రోజుల్లోను రద్దీగా ఉంటుంది. అయితే గతంలో ఈ పార్కులోకి అందరికీ అనుమతి ఉండేది. కానీ పార్కులోకి వెల్లిన కొందరు యువతీయువకులు హద్దుమీరి ప్రవర్తించడం వల్ల... మిగిలినవారు ఇబ్బందిపడేవారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం పెళ్లికాని జంటలను పార్కులోనికి అనుమతించమని పార్కు యాజమాన్యం బోర్డులు ఏర్పాటు చేసింది.
నిబంధనలు జేబు నింపుకోడానికా...