తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2021, 8:47 PM IST

ETV Bharat / city

మార్చి 31లోగా ఆస్తిపన్ను చెల్లించండి: జీహెచ్​ఎంసీ

మార్చి 31లోగా ఆస్తిపన్ను చెల్లించాలని నగర పౌరులకు జీహెచ్​ఎంసీ విజ్ఞప్తి చేసింది. సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీ-సేవా కేంద్రాలు, ఆన్​లైన్, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పన్నులు చెల్లించాలని కోరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు రూ.1503.13 కోట్లు వసూలుచేసింది.

ghmc on property tax
ఆస్తి పన్ను చెల్లించాలని జీహెచ్​ఎంసీ విజ్ఞప్తి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను సేకరణ లక్ష్యం రూ.1,900 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 1,503.13 కోట్లను జీహెచ్ఎంసీ సేకరించింది. రానున్న ఐదు రోజుల్లో రూ.400 కోట్లను సేకరించేందుకు గ్రేటర్​ అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ఆదివారం(మార్చి 28) సెలవు అయినా.. జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లను తెరిచి ఉంచాలని బల్దియా ఆదేశాలు జారీచేసింది.

వరుస సెలవుల నేపథ్యంలో సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీ-సేవా కేంద్రాలు, ఆన్​లైన్, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ఆస్తి పన్నులు చెల్లించాలని జీహెచ్​ఎంసీ అధికారులు సూచించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను సేకరణ లక్ష్యం రూ.1,800 కోట్లు నిర్ణయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) మరో వంద కోట్లు పెంచి రూ.1,900 కోట్ల లక్ష్యాన్ని నిర్థారించారు.

వడ్డీలో 90 శాతం మాఫీ!

గతేడాది ఇదే రోజునాటికి రూ.1472.31 కోట్ల ఆస్తిపన్ను సేకరణ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నేటికి రూ.1503.13 కోట్లు జీహెచ్ఎంసీ సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆస్తిపన్ను బకాయిలపై విధించే వడ్డీలో 90 శాతం మాఫీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా 2019-20 ఏడాది ఆస్తిపన్ను బకాయిలను మార్చి 31వ తేదీలోగా చెల్లించాలని బల్దియా.. నగర పౌరులకు విజ్ఞప్తి చేసింది.

ఇవీచూడండి:జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details