గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు 11,184 మందికి వరద సహాయంగా రూ.11.18 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. జీహెచ్ఎంసీ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొంది. గత మంగళవారం నుంచి నేటి వరకు 59,416 మందికి రూ.59.41 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించింది.
వరద సహాయంగా 11,184 మందికి రూ.11.18 కోట్లు - flood victims fund
వరద బాధితులకు జీహెచ్ఎంసీ తీపి కబురు అందించింది. 11,184 మందికి వరద సహాయంగా రూ.11.18 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. తాజా నిర్ణయంతో మరికొంతమంది వరద బాధితులకు కొంతమేర ఉపశమనం కలగనుంది.

వరద సహాయంగా 11,184 మందికి రూ.11.18 కోట్లు
హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన భారీ వర్షాలకు పలువురి ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయాయి. వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. బాధితులకు పరిహారంగా 10వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జీహెఎంసీ ఎన్నికల కోడ్ కారణంగా పరిహార పంపిణీకి బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు తాజాగా కొంతమందికి నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఇదీ చూడండి: బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు