బల్దియా ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జీహెచ్‌ఎంసీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మొదట ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు సిద్ధం చేసి, క్షణాల్లో వారి నియామక పత్రాలు రద్దు చేశారు. శివారులోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల సిబ్బందిని, జీహెచ్‌ఎంసీ పొరుగు సేవల ఉద్యోగులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులను తీసుకున్నారు. ఫలితంగా డిసెంబరు 1న పోలింగ్ జరగాల్సి ఉంటే, నవంబరు 30 సాయంత్రం వరకూ పూర్తిస్థాయి సిబ్బందిని సమకూర్చుకో లేకపోయారు.
ఎన్నికల తతంగం.. గంటకో నిర్ణయం.. రోజుకో విధానం.! - failures in ghmc elections 2020
ఎన్నికల ప్రక్రియను తూతూమంత్రంగా నిర్వహించారని జీహెచ్‌ఎంసీ యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏర్పాట్లు మొదలు ఫలితాల ప్రకటన వరకు అధికారులు గంటకో నిర్ణయం, రోజుకో విధానాన్ని అమలు చేశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై విమర్శలు
కూకట్‌పల్లి, మల్కాజిగిరి, తదితర సర్కిళ్లలోని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది లేకపోతే కేంద్ర కార్యాలయంలోని ఉద్యోగులను తరలించారు. విధుల కేటాయింపు సరిగా లేక పోలింగ్ రోజు అర్ధరాత్రి వరకు పోలైన ఓట్ల లెక్క తేలలేదు. లెక్కింపు ప్రక్రియలోనూ గందరగోళం నెలకొంది. దాని వల్ల పార్టీల వారీగా, నోటా గుర్తుకు పోలైన ఓట్ల వివరాలపై అధికారులు రెండో రోజుకూ స్పష్టత ఇవ్వలేకపోయారు.
- ఇదీ చూడండి :రజనీ రాకతో తమిళనాట పొత్తులాట!