కొద్దిరోజులుగా జంట నగరాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. శిథిల భవనాల్లో ఉంటున్న ప్రజల .. ప్రాణనష్టాన్ని నివారించేందుకు అటువంటి భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని దిశానిర్దేశం చేశారు.
ఆ భవనాలన్నింటికి నోటీసులు జారీ చేయండి: మంత్రి కేటీఆర్ - telangana municipal minister ktr
భాగ్యనగరంలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేయాలని పురపాలక మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంత్రి కేటీఆర్
ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి మంత్రి సూచించారు.
- ఇదీ చదవండి :ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు :కవిత