తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీకి తమిళనాడు యువకుల వీడియో.. మేయర్​ స్పందన - బొంతు రామ్మోహన్ మారేడుపల్లి పునరావాస కేంద్రం పరిశీలన

మారేడుపల్లిలో జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్​ను మేయర్ బొంతు రామ్మోహన్​ తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన యువకులు ఈటీవీకి పంపిన వీడియోకు స్పందించిన మేయర్​... అక్కడికి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ghmc mayor visit maredupalli rehabilitation center
ఈటీవీకి తమిళనాడు యువకుల వీడియో.. మేయర్​ స్పందన

By

Published : Apr 24, 2020, 8:00 PM IST

హైదరాబాద్​ మారేడుపల్లిలోని మల్టీపర్పస్​ ఫంక్షన్​ హాల్​లో జీహెచ్​ఎంసీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వలస కూలీలను మేయర్ బొంతు రామ్మోహన్ పరామర్శించారు. పునరావాస కేంద్రంలో వారికి కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయల గురించి తెలుసుకున్నారు. కిచెన్​, మరుగుదొడ్లు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసిన మేయర్​... ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని సూచించారు.

మహారాష్ట్రకు వలస వెళ్లిన 30 మంది తమిళనాడుకు చెందిన యువకులు హైద్రాబాద్​లో చిక్కుకున్నారు. జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్​లో వసతి కల్పించారు. ఇక్కడ వసతులు సరిగా లేవని సమస్యలు తెలుపుతూ ఓ వీడియోను 'ఈటీవీ'కి పంపించారు. వెంటనే స్పందించిన ఈటీవీ సిబ్బంది మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. మూడు రోజులుగా తమకు నీటి, మరుగుదొడ్ల సమస్య ఎక్కువగా ఉందని అక్కడికి వెళ్లిన మేయర్​కు చెప్పుకున్నారు. ఆహారం తింటే కడుపు నొప్పి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రోజులు ఓపిక పడితే స్వగ్రామాలకు పంపుతామని మేయర్ భరోసా ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే స్థానిక జోనల్ కమిషనర్, కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వలస కూలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లే వారు, యాచకులతోపాటు దాదాపు 170 మందికి ఇక్కడ తాత్కాలిక షెల్టర్ కల్పించినట్లు తెలిపారు. రెండు పూటలా భోజన వసతి, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. నగరంలో వసతి కల్పిస్తున్న 2500 మందిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈటీవీకి తమిళనాడు యువకుల వీడియో.. మేయర్​ స్పందన

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఈటల

ABOUT THE AUTHOR

...view details