తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​వాసులు అప్రమత్తంగా ఉండండి: మేయర్​ - తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్​లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్​ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఫ్లడ్​ కంట్రోల్​ రూం నుంచి మేయర్​, డిప్యూటీ మేయర్​.. మాన్సూన్‌ ఎమర్జెన్సీ, డీఆర్​ఎఫ్​ బృందాలను అప్రమత్తం చేశారు.

GHMC MAYOR
హైదరాబాద్​వాసులు అప్రమత్తంగా ఉండండి: మేయర్​

By

Published : Oct 20, 2020, 5:43 AM IST

హైదరాబాద్‌లో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఫ్లడ్‌కంట్రోల్‌ రూమ్‌లో మేయర్ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌బాబా ఫసియుద్ధీన్‌ వర్షాల పరిస్థితులపై సంబంధిత అధికారులతో చర్చించారు. మాన్సూన్‌ ఎమర్జెన్సీ, డీఆర్​ఎఫ్​ బృందాలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను శిబిరాలకు తరలించినట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అవసరమైతే అధికారులను సంప్రదించాలని సూచించారు.

హైదరాబాద్​వాసులు అప్రమత్తంగా ఉండండి: మేయర్​

ABOUT THE AUTHOR

...view details