నగర ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతుల విస్తరణ కోసం చేపడుతున్న పనులను వేగంగా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. అధికారులతో సమావేశమైన మేయర్ సీఆర్‌ఎంపీ కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఎకరం పైబడి ఉన్నపార్కులలో సందర్శకుల కోసం సకల వసతలు కల్పించాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీ అధికారులతో మేయర్ సమీక్ష
జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైన మేయర్ బొంతు రామ్మోహన్ సీఆర్‌ఎంపీ కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పనులను త్వరితగతిగా పూర్తి చేయ్యాలని అధికారులకు స్పష్టం చేశారు.
నరగ విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించిన మేయర్
ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంలో జాప్యాన్ని నివారించేందుకు జోనల్ కమిషనర్ల పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ విభాగాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి జోన్‌లో నాలుగు మోడల్ శ్మశానవాటికలను అందుబాటులోకి తేవాలని... అందులో రెండు హిందూ, క్రిష్టియన్ సిమెంట్రి, ముస్లిం గ్రేవ్‌యార్డ్ ఒక్కొక్కటిగా ఉండేలా చూడాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కూడళ్ళలో బస్-బే లను నిర్మించి వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.