గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత ఈనెల 22న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 9.30కు తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈనెల 22న బల్దియా మేయర్, ఉపమేయర్ బాధ్యతల స్వీకరణ - GHMC mayor takes charge on February 22nd
హైదరాబాద్ మహానగర పాలక మండలికి నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు ఈనెల 22న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30కు మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత తమ కార్యాలయాల్లో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈనెల 22న బల్దియా మేయర్, ఉపమేయర్ బాధ్యతల స్వీకరణ
ఈనెల 11న జరిగిన మేయర్ ఎన్నికల్లో గ్రేటర్ పీఠాన్ని ఇద్దరు మహిళలు దక్కించుకున్నారు. ఎంఐఎం మద్దతుతో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్గా, మోతె శ్రీలత ఉపమేయర్గా ఎన్నికయ్యారు. ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని... అన్ని పార్టీల సభ్యులను కలుపుకుని నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళతానని విజయలక్ష్మి తెలిపారు.