ఎటువంటి దరఖాస్తు చేయకుండానే జనన ధ్రువపత్రాన్ని మంజూరు చేసే విధానాన్ని జీహెచ్‌ఎంసీ త్వరలో అందుబాటులోకి తెస్తోంది. ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుల వివరాలను వైద్యులు ధ్రువీకరించి సంబంధిత సర్కిల్ కార్యాలయానికి చేరవేస్తే బల్దియా ఆమోదిస్తుంది. ధ్రువపత్రం మంజూరైనట్లు తల్లిదండ్రులకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లోని నంబరు చూపించి రాష్ట్రంలోని అన్ని మీసేవ కేంద్రాల్లో ముద్రించుకోవచ్ఛు మరణ ధ్రువపత్రాల మంజూరూ ఇలానే ఉండనుంది.
60 రోజులు దాటితే వేటే..
ఆసుపత్రులు ధ్రువీకరించిన జనన, మరణాలను అధికారులు ఆమోదించారా, లేదా అనే విషయాన్ని కమిషనర్, అదనపు కమిషనర్ తెలుసుకొంటారు. వారం, 15, 30, 60 రోజులపాటు ఆమోదానికి నోచుకోకపోతే వివరణ కోరతారు. 60 రోజులు దాటితే సదరు అధికారిపై వేటు వేస్తారు.