తెలంగాణ

telangana

ETV Bharat / city

జీహెచ్​ఎంసీ పరిధిలో కొనసాగుతున్న ఫీవర్​ సర్వే - జీహెచ్​ఎంసీ వార్తలు

గ్రేటర్ హైదరాబాద్​లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్యశాఖలకు చెందిన 709 బృందాలు 51, 178 ఇళ్లల్లో సర్వేను చేపట్టాయి.

ఫీవర్​ సర్వే
ghmc news

By

Published : May 13, 2021, 9:43 PM IST

కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్​లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇవాళ 709 బృందాలతో 51,178 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 1,73,544 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక్కో బృందంలో ఓ ఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్​లతో కూడిన బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్​కు కేవలం కరోనా సంబంధించి ఫోన్​ చేసిన వారికి ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు. రంజాన్ సందర్భంగా సెలవుదినమైనప్పటికీ ఫీవర్ సర్వే కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్, జరిమానా

ABOUT THE AUTHOR

...view details