వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్‌కు సంబంధించి నిర్ణీత ఫార్మాట్లో టికెట్‌ను ప్రకటించిన జీహెచ్ఎంసీ.. 15 రోజుల్లో టికెట్ ఇవ్వడం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో రూ.50వేలు జరిమానా విధిస్తామని ప్రకటించింది.
వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్‌కు నిర్ణీత ఫార్మాట్లో ఫీజు
వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్‌కు సంబంధించి నిర్ణీత ఫార్మాట్లో టికెట్‌ను జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఈ టికెట్‌ను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
వాణిజ్య సముదాయాలు పార్కింగ్ ఫీజు వసూల్ చేస్తున్నా.. టికెట్ ఇవ్వడం లేదని.. ఒకవేళ ఇచ్చిన పూర్తి వివరాలు ఉండటం లేదని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఈ టికెట్లో ఫీజు మినహాయింపు లేదా చెల్లింపు జరిగిన విషయం స్పష్టంగా ఉండాలని పేర్కొంది. పార్కింగ్ ఫీజు విషయంలో.. పాత ఉత్తర్వులే అమలవుతాయని స్పష్టం చేసింది.
వీటి ప్రకారం.. 30 నిమిషాల వ్యవధి వరకు ఎలాంటి పార్కింగ్ ఫీజు ఉండదు. 30 నిమిషాల వ్యవధి మించితే ఫీజు వసూల్ చేయవచ్చు. 30 నుంచి గంట వ్యవధి వరకు పార్కింగ్ చేసినప్పుడు.. షాపింగ్ రసీదు చూపిస్తే పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు గంట వ్యవధి మించి పార్కింగ్ విషయంలో షాపింగ్ బిల్లు పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువుంటే.. ఫీజు వసూల్ చేయరాదని జీహెచ్ఎంసీ పేర్కొంది.
- ఇదీ చూడండి :ఈ-బైక్ రైడ్‌తో 'పెట్రో బాదుడు'పై మమత నిరసన