గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 కేంద్రాల్లో ఎన్నికల అధికారులకు శిక్షణ ప్రారంభమైంది. డిసెంబర్ ఒకటిన జరిగే ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓలుగా ఉన్న 21 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇచ్చేందుకు 166 స్టార్ ట్రైనీలను అధికారులు ఏర్పాటు చేశారు.
గ్రేటర్ పోరు కోసం 21 వేల మంది సిబ్బందికి శిక్షణ - జీహెచ్ఎంసీ ఎన్నికల ఏర్పాట్లు
గ్రేటర్ ఎన్నికల్లో విధులు నిర్వహించబోయే సిబ్బందికి అధికారులు శిక్షణ ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓలుగా ఉన్న 21 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. 166 స్టార్ ట్రైనీలు శిక్షణ ఇస్తున్నారు.
ghmc elections training started in hyderabad
ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల శిక్షణకు హాజరయ్యే సిబ్బందిలో ఎవరైనా... హైదరాబాద్ నివాసితులుంటే... వారికి అక్కడే పోస్టల్ బ్యాలెట్‌ను అందజేస్తున్నారు. శిక్షణకు గైర్హాజరైన వారికి తదుపరి రోజు శిక్షణ ఇవ్వనున్నారు.