తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రత్యామ్నాయంగా ఏ కార్డు చూపినా అనుమతిస్తాం:లోకేష్​కుమార్​ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపినా ఓటేసేందుకు అనుమతిస్తామని ఎన్నికల అధికారి లోకేష్​కుమార్​ తెలిపారు.

ghmc election officer  lokesh kumar spoke on ghmc elections arrangements
ప్రత్నామ్నాయంగా ఏ కార్డు చూపినా అనుమతిస్తాం:లోకేష్​కుమార్​

By

Published : Nov 28, 2020, 4:50 PM IST

Updated : Nov 28, 2020, 8:57 PM IST

గ్రేటర్​లో డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో ఓట‌రు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మ‌రో 18 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపినా ఓటు వేసేందుకు అనుమతిస్తామని ఎన్నికల అధికారి లోకేష్​కుమార్ వెల్లడించారు. ఓటు వేసేందుకు ముందు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల గుర్తింపు నిర్ధర‌ణ‌కు వాటిని చూపాల్సి ఉంటుందన్నారు. ఏదైనా ఒకటి ఉన్నా ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో

1.ఆధార్ కార్డు

2.పాస్‌పోర్ట్‌

3.డ్రైవింగ్ లైసెన్స్‌

4.ఫొటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిటి కార్డ్‌

5. ఫొటోతో కూడిన‌ బ్యాంకు పాస్‌బుక్‌

6. పాన్ కార్డు

7.ఆర్‌జిఐ స్మార్ట్​ కార్డు

8. ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు

9. జాబ్ కార్డు

10. హెల్త్ కార్డు

11.ఫొటోతో కూడిన పింఛ‌ను డాక్యుమెంట్

12 ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికార గుర్తింపు ప‌త్రం

13.రేషన్ కార్డు,

14.కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం

15. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిటి కార్డు

16. ఆర్మ్స్ సెన్స్ కార్డు, అంగవైకల్యం సర్టిఫికేట్

17 లోక్​సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిటి కార్డు

18 పట్టాదారు పాస్​బుక్

ఇవీ చూడండి:ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా

Last Updated : Nov 28, 2020, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details