జీహెచ్‌ఎంసీ కొత్త స్టాండింగ్ కమిటీ ఎంపికకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ ఉంటుందని షెడ్యూల్లో వివరించారు. ఈ ఎన్నికలో 15 మంది సభ్యులను స్టాండింగ్ కమిటీకి ఎన్నుకుంటారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 10వ తేది నుంచి 18 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
నేడు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ - GHMC Election latest news today
నేడు జీహెచ్‌ఎంసీ కొత్త స్టాండింగ్ కమిటీ ఎంపికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు.
![నేడు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ GHMC Election Notification will be Released Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7481480-110-7481480-1591311810843.jpg)
నేడు విడుదల కానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్
దాఖలైన నామినేషన్ల వివరాలను 19న వెల్లడిస్తారు. 20న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూట్నీ ఉంటుంది. ఈనెల 23న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. 29న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 నుంచి 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల షెడ్యూల్లో వెల్లడించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Jun 5, 2020, 5:34 AM IST