కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో 15 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రదేశాలతో పాటు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి రోజూ ప్రత్యేక వాహనం ద్వారా శానిటైజర్ తరహా రసాయనాలను స్ప్రే చేయిస్తోన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో రసాయనాల పిచికారి - corona
కరోనాను కట్టడి చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో కరోనా వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చేయిస్తున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో రసాయనాలతో స్ప్రే...
ఈ స్ప్రేను సాంకేతిక పద్ధతిలో తయారు చేశామని... వైరస్ వ్వాప్తి చెందకుండా నియంత్రించే అవకాశాలు అధికంగా ఉంటాయని జీహెచ్ఎంసీ ముఖ్య ఎంటమాలజిస్ట్ డా. రాంబాబు తెలిపారు.
ఇదీ చూడండి:జీవోలు విడుదల.. పోలీసులు ఆటంకం కల్గించొద్దు