తెలంగాణ

telangana

ETV Bharat / city

బిచ్చగాళ్లు ఎక్కడున్నా సమాచారమివ్వండి: జీహెచ్​ఎంసీ - జీహెచ్​ఎంసీ వార్తలు

హైదరాబాద్​ను బెగ్గర్‌ ఫ్రీ సిటీగా చేయాలని సిటీ సమన్వయ సమావేశం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్​లో యాచక వృత్తిలో ఉన్న వారిని గుర్తించి వారికి పునరావాసం కల్పించటంతో పాటు అర్హులైన వారికి వివిధ రంగాల్లో జీవనోపాధిని కల్పించనున్నారు.

GHMC decides to make Hyderabad a beggar free city
బిచ్చగాళ్లు ఎక్కడున్నా సమాచారమివ్వండి: జీహెచ్​ఎంసీ

By

Published : Jan 21, 2021, 4:59 PM IST

భాగ్యనగరంలో ఉన్న బిచ్చగాళ్లను గుర్తించి వారికి పునరావాసం కల్పించటంతో పాటు అర్హులైన వారికి వివిధ రంగాల్లో జీవనోపాధిని కల్పించాలని సిటీ సమన్వయ సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు పోలీస్​, రెవెన్యూ తదితర విభాగాలతో కలిసి పనిచేయాలని హైదరాబాద్​లో జరిగిన సిటీ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు.

నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రార్థన స్థలాల వద్ద యాచకులు ఉంటే వారి సమాచారాన్ని తమకు తెలియజేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ కోరారు. గుర్తించిన యాచకులను తగు వైద్య పరీక్షలు నిర్వహించి జీహెచ్‌ఎంసీలో ఉన్న షెల్టర్‌ హోంల్లో ఆశ్రయం కల్పిస్తామన్నారు. తగు శారీరక దారుఢ్యం కలిగిన వారికి స్వయం ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇప్పిస్తామని కమిషనర్ వెల్లడించారు.

ఇదీ చదవండి:'రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు'

ABOUT THE AUTHOR

...view details