తెలంగాణ

telangana

ETV Bharat / city

విదేశీ టపాకాయల అమ్మకం చట్ట వ్యతిరేకం: లోకేశ్​ కుమార్ - నగరంలో టపాకాయలు నిషేధించినట్టు జీహెచ్​ఎంసీ కమిషనర్ వెల్లడి

విదేశీ టపాకాయలు హైదరాబాద్​లో దిగుమతి చేయడం, అమ్మడం చట్ట వ్యతిరేకమని జీహెచ్​ఎంసీ కమిషనర్ తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బ్యాన్​ చేసిందని వెల్లడించారు.

ghmc commissioner lokesh kumar announce crackers ban in hyderabad
నగరంలో టపాకాయల అమ్మడం చట్ట వ్యతిరేకం: లోకేష్ కుమార్

By

Published : Nov 11, 2020, 9:29 PM IST

Updated : Nov 11, 2020, 9:55 PM IST

విదేశీ టపాకాయల దిగుమతులు, అమ్మకాలు, సరఫర చట్ట వ్యతిరేకమని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్​లో విదేశీ టపాకాయల అమ్మకాలను గుర్తించేందుకు బృందాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ప్రజలు విదేశీ టపాకాయలపై జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే బ్యాన్ చేసిందని.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి నగరానికి దిగుమతి కాలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసు విచారణ 16కు వాయిదా

Last Updated : Nov 11, 2020, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details