తెలంగాణ

telangana

ETV Bharat / city

high alert in hyderabad: మూసినదికి వరద ఉద్ధృతి.. పలు ప్రాంతాల్లో హై అలర్ట్​ - cyclone gilab news

గులాబ్​ తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరువానలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో సోమవారం నాటి వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భాగ్యనగరంలో జంట జలాశయాలైన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ గేట్లను ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసికి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాాలకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీచేశారు.

high alert in hyderabad
high alert in hyderabad

By

Published : Sep 28, 2021, 3:48 PM IST

Updated : Sep 28, 2021, 4:22 PM IST

గులాబ్​ తుపాను ప్రభావంతో (cyclone gulab effect) రాజధాని హైదరాబాద్​ సహ పలు జిల్లాల్లో సోమవారం భారీ వానలు (heavy rains in hyderabad) కురిశాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా వాన(Heavy Rain in Telangana) పడుతూనే ఉంది. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.

హైదరాబాద్​లో హై అలర్ట్​..

హైదరాబాద్‌ జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్ (himayat sagar), ఉస్మాన్‌సాగర్ (osman sagar) గేట్ల ఎత్తివేతతో మూసీకి వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. ఫలితంగా మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. చాదర్‌ఘాట్‌ వద్ద వంతెనను ఆనుకుని మూసీ వరద ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపేశారు. కోఠి-చాదర్‌ఘాట్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా వరద వస్తుండడం వల్ల చాదర్‌ఘాట్ వంతెనపై పోలీసుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీచేశారు. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ (high alert in hyderabad) ప్రకటించారు. పీర్జాదిగూడలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. జియాగూడ వద్ద మూసీ నది (heavy water inflow to musi river)ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

high alert in hyderabad: మూసినదికి వరద ఉద్ధృతి.. పలు ప్రాంతాల్లో హై అలర్ట్​

రోడ్లపై మోకాల్లోతు నీరు..

సోమవారం నాటి జోరువానలకు భాగ్యనగరం తడిసిముద్దయింది. వందలాది వందలాది కాలనీలు నీటమునిగాయి. నాలాలు, కాలువలు ఉప్పొంగాయి. రహదారులు ఏరులయ్యాయి. అనేక ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బహదూర్‌పుర చౌరస్తా నుంచి కిషన్‌బాగ్‌ వెళ్లే రహదారిలో నడుము లోతు నీరు నిలవడంతో స్థానికులు తాళ్ల సాయంతో రోడ్డు దాటారు.

తీవ్ర అల్పపీడనంగా..

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం మంగళవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు విదర్భ పరిసర ప్రాంతాల్లో.... నాగపూర్‌కు నైరుతి దిశగా 250 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 6 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఇదీచూడండి:

Last Updated : Sep 28, 2021, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details